నిన్ను విడిచి నీ ప్రేమ మరచి

Ninnu Vidici Ni Prema Maraci

K Rajababu 08 Dec 2025
నిన్ను విడిచి నీ ప్రేమ మరచి - నేనెటు పోగలను దేవా ఎవ్వరు నీ ప్రేమ నాకిల చూపగలరు || 2 || నాదేవా నా దేవా నా దేవా || నిన్ను విడిచి || దారి తొలగి తీరము చేరని ఘోర సుడిగాలిలో నాయకుడా నా ఆర్త ధ్వని విని నావను నడిపించినావే - తీరము చూపించినావే యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా నేనెటు పోగలను దేవా-ఎవ్వరు నీ ప్రేమ నాకిల చూపగలరు శ్రమల పాలైతి సొమ్మసిల్లితి - సిలువకు నే చేరితి శ్రీకరుడా నా శిలువను మోసి - ఆదరణె చూపినావే నూతన బలమిచ్చినావే .... యేసయ్యా నేనెటు పోగలను దేవా - యేసయ్యా నా యేసయ్యా||నిన్ను|| విరిగి నలిగిన నా హృదయాన నీకే సింహాసనం శ్రీమంతడా నా షాలెము రాజా బ్రతికెద నీ కోసమే చావైన లాభమే నేనెటు పోగలను దేవా - యేసయ్యా నా యేసయ్యా||నిన్ను||