ఇంతవరకు కాపాడినావు
Intavaraku Kapadinavu
28 Oct 2025
ఇంతవరకు కాపాడినావు వందనాలయ్యా
ఎన్నో మేళ్లతో నింపినందుకు వందనాలయ్యా || 2 ||
అమ్మ వలె చూచినందుకు వందనాలయ్యా || 2 ||
(మా) నాన్న వలె కాచినందుకు వందనాలయ్యా || 2 ||
వందనాలే… ఆ ఆ.. ఆ…
వందనాలే… రాజా…
వందనాలయ్యా వందనాలయ్యా
వందనాలయ్యా వందనాలయ్యా
వ్యాధి వేదనలో స్వస్థతనిచ్చావు వందనాలయ్యా
అప్పు చెరలో విడుదలనిచ్చావు వందనాలయ్యా || 2 ||
మా పరమ వైద్యుడై నిలిచినందుకు వందనాలయ్యా || 2 ||
(నీ) రక్తము కార్చి విడుదలనిచ్చావు వందనాలయ్యా || 2 || ||వందనాలే||
నిన్న నేడు మారని వాడవు వందనాలయ్యా
మాపై చూపిన ప్రేమకై వందనాలయ్యా || 2 ||
మేఘ స్తంభమై నిలిచినావు నీకు వందనాలయ్యా || 2 ||
అగ్ని స్తంభమై కాపాడినావు వందనాలయ్యా || 2 || ||వందనాలే||
వెక్కి వెక్కి నేను ఏడ్చిన వేళ వందనాలయ్యా
చంకన ఎత్తి ఓదార్చినావు వందనాలయ్యా || 2 ||
కష్ట కాలంలో కాపాడినావు వందనాలయ్యా || 2 ||
(నీ) ధైర్యమిచ్చి నడిపించావు వందనాలయ్యా || 2 || ||వందనాలే||