ఎవరూ సమీపించలేని
Evaru Samipincaleni
Hosanna Ministries
28 Oct 2025
ఎవరూ సమీపించలేని
తేజస్సుతో నివసించు నా యేసయ్యా || 2 ||
నీ మహిమను ధరించిన పరిశుద్ధులు
నా కంటబడగానే || 2 ||
ఏమౌదునో నేనేమౌదునో || 2 ||
ఇహలోక బంధాలు మరచి
నీ యెదుటే నేను నిలిచి || 2 ||
నీవిచ్చు బహుమతులు నే స్వీకరించి
నిత్యానందముతో పరవశించు వేళ || 2 || ||ఏమౌదునో||
పరలోక మహిమను తలచి
నీ పాద పద్మములపై ఒరిగి || 2 ||
పరలోక సైన్య సమూహాలతో కలసి
నిత్యారాధన నే చేయు ప్రశాంత వేళ || 2 || ||ఏమౌదునో||
జయించిన వారితో కలిసి
నీ సింహాసనము నే చేరగా || 2 ||
ఎవరికి తెలియని ఓ క్రొత్త పేరుతో
నిత్య మహిమలో నను పిలిచే ఆ శుభ వేళ || 2 || ||ఏమౌదునో||