ఓ క్రీస్తు సంఘమా, పరిశుద్ధ

O Kristu Sanghama Parisuddha

Sayaram Gattu 28 Oct 2025
ఓ క్రీస్తు సంఘమా, పరిశుద్ధ సంఘమా ప్రభువు నామములో సాగే అనుబంధమా ఓ ప్రియ సంఘమా, యేసయ్య దేహమా ఓ కంట కన్నీరు తగదు సహవాసమా ప్రతి కష్టము మనము పంచుకుందాము కలిసి అందరము వేడుకుందాము || 2 || ||ఓ క్రీస్తు|| మనమంతా కలిసి ఆ దేవుని దేహము తండ్రి చిత్తముగా ఏర్పడిన సంఘము || 2 || ఏ భాగము శ్రమ పడినా కలిగెను వేదన ఒక్కరికి ఘనతయినా అందరికి ఆదరణ || 2 || ||ప్రతి కష్టము|| సాటి సోదరులు శ్రమల పాలైనపుడు సాతాను శక్తులచే శోధింపబడినపుడు || 2 || ధైర్యమును నింపాలి, విశ్వాసము పెంచాలి ఎడతెగక ప్రార్థించి శోధనను గెలవాలి || 2 || ||ప్రతి కష్టము|| శ్రమలు పొందేవారు అవిధేయులు కారు విశ్వాసము పెంచుకొని దేవునిలో ఎదిగేరు || 2 || శాంతమును పాటించి, దేవునిలో వీక్షించి పంచాలి ఓదార్పు వదిలేసి మన తీర్పు || 2 || ||ప్రతి కష్టము||