ఇంటి మీద నున్న ఒంటరి పిచ్చుకను నేను
Inti Mida Nunna Ontari Piccukanu Nenu
16 Dec 2025
ఇంటి మీద నున్న ఒంటరి పిచ్చుకను నేను
కన్నీటితో కృంగి పోతున్నాను || 2 ||
నా యేసయ్యా నా బలమా || 2 ||
నా దీన ప్రార్థన ఆలకించుమా ||ఇంటి మీద||
వెతకాని బాణమును చేయుచుండె గాయములు
అపవాది కోరలు కోరుచుండె ప్రాణమును – || 2 ||
నీ బాలి పీఠము చెంత నాకు చోటునీయుమా || 2 ||
ఆలకించుమా ఆదరించుమా || 2 || ||ఇంటి మీద||
తెలిసి తెలిసి చేసితిని ఎన్నెన్నో పాపములు
తరచి తరచి చూచినా తరగవు నా దోషములు – || 2 ||
నీ ఆత్మను కోల్పోయిన దీనుడను నేను || 2 ||
ఆలకించుమా ఆదరించుమా || 2 || ||ఇంటి మీద||