గుండె నిండా యేసు ఉంటే కన్నీళ్లే
Gunde Ninda Yesu Unte Kannille
28 Oct 2025
గుండె నిండా యేసు ఉంటే కన్నీళ్లే ముత్యాలు
గుండె గుడిలో యేసు ఉంటే దుఃఖమైనా సంతోషం || 2 ||
గుండె నిండా నువ్వే
యేసు గుండె నిండా నువ్వే (4)
లోక స్నేహం వెలివేసినా
శోకంలో ముంచి వేసినా – నీవే నా నేస్తం
నా హృదయం చెప్పేదొక్కటే
గుండె నిండా నువ్వే || 2 || ||గుండె నిండా నువ్వే||
ఊపిరంతా శాపమైనా
గాలి కూడా గేలిచేసినా – నీవే నా చెలిమి
జాలి లేని ఇలలోన
నీవే నా కలిమి || 2 || ||గుండె నిండా నువ్వే||
చిరకాలం నీ ఒడిలో
ఉండాలని ఆశతో
చెమ్మగిల్లే కలలతోనే
పాడుతున్నా గీతం || 2 || ||గుండె నిండా నువ్వే||