కనురెప్ప పాటైన కను మూయలేదు
Kanureppa Pataina Kanu Muyaledu
Guntur Raja
28 Oct 2025
కనురెప్ప పాటైన కను మూయలేదు – ప్రేమ ప్రేమ ప్రేమ
నిరుపేద స్థితిలోను నను దాటిపోలేదు – ప్రేమ ప్రేమ ప్రేమ || 2 ||
పగలూ రేయి పలకరిస్తోంది
పరమును విడిచి నను వరియించింది || 2 ||
కలవరిస్తోంది ప్రేమా
ప్రాణమిచ్చిన కలువరి ప్రేమ ||కనురెప్ప||
ప్రేమ చేతిలో నను చెక్కుకున్నది
ప్రేమ రూపుతో నను మార్చియున్నది || 2 ||
ప్రేమను మించిన దైవం లేదని
ప్రేమను కలిగి జీవించమని || 2 ||
ఎదురు చూస్తోంది ప్రేమా
కలవరిస్తోంది క్రీస్తు ప్రేమ ||కనురెప్ప||
ప్రేమ లోగిలికి నను పిలుచుచున్నది
ప్రేమ కౌగిలిలో బంధించుచున్నది || 2 ||
ప్రేమకు ప్రేమే తోడవుతుందని
ప్రేమకు సాటి లేనే లేదని || 2 ||
పరవశిస్తోంది ప్రేమా
కలవరిస్తోంది క్రీస్తు ప్రేమ ||కనురెప్ప||