దినమెల్ల నే పాడినా
Dinamella Ne Padina
16 Dec 2025
దినమెల్ల నే పాడినా కీర్తించినా
నీ ఋణము నే తీర్చగలనా
కొనియాడి పాడి నీ సాక్షిగానే
ఇలలో జీవించనా ||దినమెల్ల||
గాయపడిన సమయాన మంచి సమరయునిలా
నా గాయాలు కడిగిన దేవా
ఆకలైన వేళలో ఆహారమిచ్చి
నన్ను పోషించినావు దేవా || 2 ||
నిను విడువనూ ఎడబాయననినా || 2 ||
నా యేసయ్య ||దినమెల్ల||
నా బలహీనతయందు నా సిలువను మోస్తూ
నిన్ను పోలి నేను నడిచెదన్
వెనుకున్నవి మరచి ముందున్న వాటికై
సహనముతో పరుగెత్తెదన్ || 2 ||
ఉన్నత పిలుపునకు కలుగు బహుమానము || 2 ||
నేను పొందాలని ||దినమెల్ల||