కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను

Kondala Tattu Na Kannulu Ettucunnanu

28 Oct 2025
కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను || 2 || నాకు సహాయం ఎక్కడ నుండి వచ్చును || 2 || యెహోవా వలనే – యెహోవా వలనే నాకు సహాయం కలుగును – కలుగును || 2 || కలుగును భూమ్యాకాశంబులను – సృజియించిన దేవా నా పాదంబులను – తొట్రిల్లనీయడు || 2 || నను కాపాడువాడు కునుకడు – నిదురపోడెన్నడు || 2 || యెహోవా నను ప్రేమించి – కాపాడి రక్షించును || 2 || ||యెహోవా|| నా కుడిప్రక్క నీడగా – యెహోవా ఉండును పగటి ఎండ రాత్రి వెన్నెల – దెబ్బైన తగలక || 2 || ఏ అపాయము నాకు రాకుండా – యెహోవా కాపాడును || 2 || నా రాకపోకలయందును – కాపాడి రక్షించును || 2 || ||యెహోవా|| వేటకాని ఉరిలోనుండి – విడిపించిన దేవా నాశనకరమైన తెగులు రాకుండ – రక్షించిన దేవా || 2 || నీ బలమైన రెక్కలతో కప్పుమయా – మా రక్షణ ఆధారమా || 2 ||