హల్లెలూయా స్తోత్రం యేసయ్యా

Halleluya Stotram Yesayya

N John Wesley 28 Oct 2025
హల్లెలూయా స్తోత్రం యేసయ్యా || 2 || గడచిన కాలము కృపలో మమ్ము దాచిన దేవా నీకే స్తోత్రము పగలూ రేయి కనుపాపవలె కాచిన దేవా నీకే స్తోత్రము || 2 || మము దాచిన దేవా నీకే స్తోత్రము కాపాడిన దేవా నీకే స్తోత్రము || 2 || ||గడచిన|| కలత చెందిన కష్టకాలమున కన్న తండ్రివై నను ఆదరించిన కలుషము నాలో కానవచ్చినా కాదనక నను కరుణించిన || 2 || కరుణించిన దేవా నీకే స్తోత్రము కాపాడిన దేవా నీకే స్తోత్రము || 2 || ||గడచిన|| లోపములెన్నో దాగి ఉన్నను ధాతృత్వముతో నను నడిపించినా అవిధేయతలే ఆవరించినా దీవెనలెన్నో దయచేసిన || 2 || దీవించిన దేవా నీకే స్తోత్రము దయచూపిన తండ్రి నీకే స్తోత్రము || 2 || ||గడచిన||