జీవన తొలి సంధ్య నీతోనే ఆరంభం
Jivana Toli Sandhya Nitone Arambham
Gudapati Isaac Varaprasad
28 Oct 2025
జీవన తొలి సంధ్య నీతోనే ఆరంభం
నా జీవన మలి సంధ్య నీతోనే అంతము || 2 ||
నా జీవన యాత్రకు మలి సంధ్య ఆసన్నమౌతుంది || 2 ||
నను సిద్ధపరచు యేసు నాథా నీతోనుండుటకు || 2 || ||జీవన||
నా జీవన యాత్రలో ఎన్నో అవరోధాలు
నా జీవన గమనంలో ఎన్నో అవమానాలు || 2 ||
నిరీక్షణ లేని ఇతరుల పోలి దుఃఖించను నేను
నా భారము నీపై మోపి ముందుకు సాగుచున్నాను || 2 ||
దేవా నీవే నా ఆశ్రయ దుర్గము || 2 || ||జీవన||
నా పూర్వికులందరు ఎప్పుడో గతించారు
ఏదో ఒక రోజున నా యాత్ర ముగించెదను || 2 ||
నా శేష జీవితమంతయు నీకే అర్పించితినయ్యా
నా వేష భాషయులన్నియు నీకే సమర్పింతును దేవా || 2 ||
దేవా నను నీ సాక్షిగ నిల్పుమా || 2 || ||జీవన||