ద్రాక్షావల్లివి నీవైతే
Draksavallivi Nivaite
28 Oct 2025
ద్రాక్షావల్లివి నీవైతే
తీగెగ నేను ఎదిగితిని || 2 ||
తండ్రి తోటలో నే నాటబడితి
ఎంత ధన్యత ఈ మహిలో – || 2 || ||ద్రాక్షా||
చల్ల గాలులు వీచగా
కాంతి కిరణాలు ప్రసరించగా || 2 ||
నీతి సూర్యుని నిజ కాంతిలోన
తేజరిల్లెడి బ్రతుకు తోడ
రక్షణ తోటలో విరివిగ పెరిగి
నీటి యోరన నిలిచితిని – || 2 || ||ద్రాక్షా||
కొమ్మ కొమ్మను చూడగా
తీగలెన్నో అగుపించెనే || 2 ||
ఆకు మాటున తీగె గావున
మొలవనున్నవి ఫలములెన్నో
నిలిచె అందులో ఫలితము కొరకై
కలిగె స్నేహము యేసునితో – || 2 || ||ద్రాక్షా||