అన్ని నామముల కన్న పై నామము

Anni Namamula Kanna Pai Namamu

M Jyothi Raju 07 Dec 2025
అన్ని నామముల కన్న పై నామము – యేసుని నామము ఎన్ని తరములకైనా ఘనపరచ దగినది – క్రీస్తేసు నామము || 2 || యేసు నామము జయం జయము సాతాను శక్తుల్ లయం లయము || 2 || హల్లెలూయ హొసన్న హల్లెలూయా – హల్లెలూయా ఆమెన్ || 2 || పాపముల నుండి విడిపించును యేసుని నామము || 2 || నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును క్రీస్తేసు నామము || 2 || ||యేసు నామము || సాతాను పై అధికార మిచ్చును శక్తి గల యేసు నామము || 2 || శత్రు సమూహము పై జయమునిచ్చును జయశీలుడైన యేసు నామము || 2 || ||యేసు నామము || స్తుతి ఘన మహిమలు చెల్లించుచు క్రొత్త కీర్తన పాడెదము || 2 || జయ ధ్వజమును పైకెత్తి కేకలతో స్తోత్ర గానము చేయుదము || 2 || ||యేసు నామము ||