నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను
Nenemaina Prabhuva Ninne Stutistanu
16 Dec 2025
నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను
నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను || 2 ||
నేనేమైయున్నానో నీ దయ వలనేనయ్యా || 2 ||
నాకున్నవన్నియు నీవిచ్చినవేనయ్యా || 2 || ||నేనేమైనా||
లేక లేక వృద్ధాప్యమందు
ఏకైక కుమారుని ఇచ్చింది నీవే || 2 ||
ఇచ్చిన నీవే బలి కోరగా || 2 ||
తెచ్చి నీకు అర్పించిన అబ్రహాములా ||నేనేమైనా||
సర్వము పోయి శరీరము కుళ్ళిన
నా అనువారే వెలివేసినా || 2 ||
ఆప్తులంతా శత్రువులైనా || 2 ||
అంతము వరకు సహియించిన ఆ యోబులా ||నేనేమైనా||
నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే
చావైనా అది నాకెంతో మేలే || 2 ||
ఇదిగో నేను ఉన్నానయ్యా || 2 ||
దయతో నన్ను గైకొనుమయ్యా నా యేసయ్యా ||నేనేమైనా||