నడిపిస్తాడు నా దేవుడు
Nadipistadu Na Devudu
A R Stevenson
01 Mar 2026
నడిపిస్తాడు నా దేవుడు – శ్రమలోనైనా నను విడువడు || 2 ||
అడుగులు తడబడినా – అలసట పైబడినా || 2 ||
చేయి పట్టి వెన్నుతట్టి – చక్కని ఆలొచన చెప్పి || 2 || ||నడిపిస్తాడు||
అంధకారమే దారి మూసినా – నిందలే నను కృంగదీసినా || 2 ||
తన చిత్తం నెరవేర్చుతాడు
గమ్యం వరకు నను చేర్చుతాడు || 2 || ||నడిపిస్తాడు||
కష్టాల కొలిమి కాల్చివేసినా – శోకాలు గుండెను చీల్చివేసినా || 2 ||
తన చిత్తం నెరవేర్చుతాడు
గమ్యం వరకు నను చేర్చుతాడు || 2 || ||నడిపిస్తాడు||
నాకున్న కలిమి కరిగిపోయిన – నాకున్న బలిమి తరిగిపోయిన || 2 ||
తన చిత్తం నెరవేర్చుతాడు
గమ్యం వరకు నను చేర్చుతాడు || 2 || ||నడిపిస్తాడు||