నన్నెంతగానో ప్రేమించిన ప్రభువా
Nannentagano Premincina Prabhuva
Kranthi Chepuri
28 Oct 2025
నన్నెంతగానో ప్రేమించిన ప్రభువా
నా దీన బ్రతుకునే దీవించిన దేవా || 2 ||
నిన్నే ఆరాధింతును – నీలో ఆనందింతును || 2 ||
నా యవ్వనమంతా… నా జీవితమంతా || 2 || ||నన్నెంతగానో||
ధరలోని మన్నుతో సమమైన నన్ను
ఎన్నుకొని ఉన్నత స్థితికి చేర్చినావు || 2 ||
అన్నీ నీవే నాకై సమకూర్చినావు
ఉన్నాను నీ తోడు భయపడకన్నావు || 2 ||
వాక్యపు మన్నాతో పోషించిన నన్నే
ఎన్నడూ విడువని ఎడబాయని నిన్నే ||నిన్నే||
దినమెల్ల నా కొరకే కనిపెట్టినావు
ఎల్లవేళలా నా తోడుగ నిలిచావు || 2 ||
మెల్లని నీ స్వరముతో మాట్లాడినావు
చల్లని కరములతో నా కన్నీరు తుడిచావు || 2 ||
పాపపు ముళ్ళును తొలగించుటకై నాలో
మరణపు విల్లును విరచిన దేవా నీలో ||నీలో||