నన్నెంతగా ప్రేమించితివో
Nannentaga Premincitivo
Joshua Shaik
28 Oct 2025
నన్నెంతగా ప్రేమించితివో
నిన్నంతగా దూషించితినో
నన్నెంతగా నీవెరిగితివో
నిన్నంతగా నే మరచితినో
గలనా – నే చెప్పగలనా
దాయనా – నే దాయగలనా || 2 ||
అయ్యా… నా యేసయ్యా
నాదం – తాళం – రాగం
ఎదలో నీదే ఈ ప్రేమ స్వరము || 2 ||
ఏ రీతిగా నా ఉదయమును నీ ఆత్మతో దీవించితివో
ఏ రీతిగా నా భారమును నీ కరుణతో మోసితివో || 2 ||
ఏ రీతిగా నా పలుకులో నీ నామమును నిలిపితివో
ఏ రీతిగా నా కన్నీటిని నీ ప్రేమతో తుడిచితివో || 2 || ||గలనా||
ఏ రీతిగా నా రాతను నీ చేతితో రాసితివో
ఏ రీతిగా నా బాటను నీ మాటతో మలిచితివో || 2 ||
ఏ రీతిగా నా గమ్యమును నీ సిలువతో మార్చితివో
ఏ రీతిగా నా దుర్గమును నీ కృపతో కట్టితివో || 2 || ||గలనా||