నా జీవిత యాత్రలో

Na Jivita Yatralo

28 Oct 2025
నా జీవిత యాత్రలో ప్రభువా నీ పాదమే శరణం ఈ లోకమునందు నీవు తప్ప వేరే ఆశ్రయం లేదు || 2 || ||నా జీవిత|| పలు విధ శోధన కష్టములు ఆవరించియుండగా || 2 || కలత చెందుచున్న హృదయమును కదలక కాపాడుము || 2 || ||నా జీవిత|| నీ సన్నిధిలో సంపూర్ణమైన సంతోషము కలదు || 2 || నీదు కుడి హస్తములో నిత్యమున నాకు సుఖ క్షేమముగా || 2 || ||నా జీవిత|| ఈ లోక నటన ఆశలన్నియు తరిగిపోవుచుండగా || 2 || మారని వాగ్ధానములన్నియు నే నమ్మి సాగెదను|| 2 || ||నా జీవిత|| ముందున్న సంతోషము తలంచి నిందలను సహించి || 2 || నీ సిలువను నే మోయుటకై నీ కృప నాకీయుము || 2 || ||నా జీవిత|| సీయోను యొక్క ఆలోచనతో సదా నడిపించుము || 2 || మహిమలో నీతోనే నిల్చుటకు నా తండ్రి దయచూపుము || 2 || ||నా జీవిత||