నా అర్పణలు

Na Arpanalu

16 Dec 2025
నా అర్పణలు నీవు పరిశుద్ధపరచుచున్నావని యేసయ్య నీ పాదాల చెంత నా శిరము వంచెద ||2|| నీవే నాకని నేనే నీకని నాకై విజ్ఞాపన చేయుచున్నానని ||2|| ఆధారణలేని ఈ లోకములో ఆనుకొంటినే యెదుటే నిలిచే నీపైనే ||2|| అనురాగాసీమలో అనుబంధము పెంచిన నీతో అరణ్యవాసమే మేలాయెనే ||2|| || నా అర్పణలు || గమ్యమెరుగని వ్యామోహాలలో గురి నిలిపితినే మార్గము చూపిన నీపైనే ||2|| గాలిని గద్ధించి గాలిమేడలు కూల్చిన నీతో షాలేము నీడయే నాకు మేలాయెనే ||2|| || నా అర్పణలు || మందకాపరుల గుడారాలలో మైమరచితినే మమతను చూపిన నీపైనే ||2|| మహిమాన్వితమైన నీ మందలో నను దాచిన నీతో సీయోనుధ్యానమే నాకు మేలాయెను ||2|| || నా అర్పణలు ||