నీతో నా జీవితం సంతోషమే

Nito Na Jivitam Santosame

Hosanna Ministries 28 Oct 2025
నీతో నా జీవితం సంతోషమే నీతో నా అనుబంధం మాధుర్యమే || 2 || నా యేసయ్యా కృప చూపుచున్నావు – వాత్సల్యపూర్ణుడవై నా యేసయ్యా నడిపించుచున్నావు – స్ఫూర్తిప్రదాతవై ఆరాధ్యుడా యేసయ్యా… నీతో నా అనుబంధం మాధుర్యమే భీకర ధ్వనిగలా మార్గమునందు నను స్నేహించిన నా ప్రియుడవు నీవు || 2 || కలనైన మరువను నీవు నడిపిన మార్గం క్షణమైన విడువను నీతో సహవాసం || 2 || ||ఆరాధ్యుడా|| సంతోషమందైనా శ్రమలయందైనను నా స్తుతి కీర్తనకు ఆధారము నీవే || 2 || నిత్యమైన మహిమలో నను నిలుపుటకు శుద్ధ సువర్ణముగా నను మార్చుచున్నావు || 2 || ||ఆరాధ్యుడా|| ఆకాశమందుండి ఆశీర్వదించితివి అభాగ్యుడనైన నేను కనికరింపబడితిని || 2 || నీలో నిలుచుటకు బహుగా ఫలించుటకు నూతన కృపలతో నను నింపుచున్నావు || 2 || ||నీతో నా||