నీవు లేనిదే నేను లేను ప్రభువా
Nivu Lenide Nenu Lenu Prabhuva
G Esther Rani
28 Oct 2025
నీవు లేనిదే నేను లేను ప్రభువా
నీ కృప లేనిదే నే బ్రతుకలేనయ్యా
బ్రతుకలేనయ్యా నీవు లేక క్షణమైనా || 2 ||
నీవు లేకుంటే నా బ్రతుకే శూన్యం || 2 ||
మరువకయ్యా నన్ను ఏ క్షణము దేవా || 2 ||
నీ ప్రేమతో నన్ను లాలించు ప్రతి క్షణము || 2 || ||నీవు||
గమ్యమును ఎరుగక నేను వెతలు పాలైన వేళ
తీరాన్ని దాటలేని నావ నేనైన వేళ || 2 ||
నా గమ్యం నీవైతి – ఆ గమ్యం సిలువాయే || 2 ||
ఆ సిలువే నాకు శరణం
నా పాప పరిహారం || 2 || ||నీవు||
అపజయమే నాదు బ్రతుకును విషాదముగా మార్చిన వేళ
జీవించుటకాశ లేక మరణాన్ని కోరిన వేళ || 2 ||
నా ఆశ నీవైతి – ఆ ఆశ సిలువాయే || 2 ||
ఆ సిలువే నాకు నిరతం
నా జీవిత చిరుదీపం || 2 || ||నీవు||