నన్ను పిలిచిన దేవా
Nannu Pilicina Deva
Benny Joshua
28 Oct 2025
నన్ను పిలిచిన దేవా – నన్ను ముట్టిన ప్రభువా
నీవు లేనిదే నేను లేనయ్యా || 2 ||
నే జీవించునది నీ కృప – ఎదుగించునది నీ కృప
హెచ్చుంచునది నీ కృప మాత్రమే || 2 ||
నీ కృపయే కావలెను – నీ కృపయే చాలును
నీ కృప లేకుంటేనే నేనేమీ లేనయ్యా || 2 || యేసయ్యా…
ఒంటరిగా ఏడిచినప్పుడు ఓదార్చువారు లేరు
తొట్రిల్లి నడిచినప్పుడు ఆదుకొన్నవారు లేరు || 2 ||
బిగ్గరిగా ఏడిచినప్పుడు కన్నీరు తుడిచే కృప || 2 ||
నీ కృప లేకుంటేనే నేను లేను
నీ కృప లేకుంటేనే నేనేమి లేను ||నీ కృపయే||
నేనని చెప్పుటకు నాకేమి లేదు
సామర్ధ్యము అనుటకు నాకని ఏమి లేదు || 2 ||
అర్హత లేని నన్ను హెచ్చించినది నీ కృప || 2 ||
నీ కృప లేకుంటేనే నేను లేను
నీ కృప లేకుంటేనే నేనేమి లేను ||నీ కృపయే||