ఆకాశమందు నీవు తప్ప

Akasamandu Nivu Tappa

Bro. Yesanna Garu 18 Nov 2025
ఆకాశమందు నీవు తప్ప ప్రభువా ఎవరు ఉన్నారు వేరెవ్వరు ఉన్నారు ||2|| నీవు మాకుండగా లోకములోనిది ఏదియు మాకు అక్కరలేదే ప్రభువా నీవు మాకుంటే చాలు ||2|| ||ఆకాశ|| ఆకాశాము నీ సింహాసనము ఈ భూమి నీ పాదపీఠము ||2|| నిన్ను నేను స్తుతియించెదను నిత్యము నిన్నే కొనియాడెదను ||2|| ||ఆకాశ|| నా తల్లిదండ్రులు - నన్ను విడనాడినా నా బంధు స్నేహితులు - మరచిపోయిన ||2|| మరువనంటివే విడువనంటివే ప్రేమతో నన్నూ ఆదరించినావే ||2|| ||ఆకాశ||