అమరుడవు నీవు నాయేసయ్యా

Amarudavu Nivu Nayesayya

18 Nov 2025
అమరుడవు నీవు నాయేసయ్యా - ఆదియు అంతము నీవేనయ్యా ఆదిలోనున్న నీ వాక్యమే - ఆదరించెను శ్రమకొలిమిలో సొమ్మసిల్లక - సాగిపోదును - సీయోను మార్గములో స్తోత్రగీతము - ఆలపింతును - నీదివ్య సన్నిధిలో ||అమరుడవు|| శక్తికి మించిన సమరములో - నేర్పితివి నాకు నీ చిత్తమే శిక్షకు కావే శోధనలన్నీ - ఉన్నత కృపతో నను నింపుటకే || 2 || ప్రతి విజయము నీకంకితం - నాబ్రతుకే నీ మహిమార్థం లోకమంతయు - దూరమైనను - ననే చేరదీసెదవు దేహమంతయు - ధూళియైనను - జీవింపజేసెదవు ||అమరుడవు|| వేకువకురిసిన చిరుజల్లులో - నీకృప నాలో ప్రవహించగా - పొందితినెన్నో ఉపకారములు - నవనూతనమే ప్రతిదినము || 2 || తీర్చగలనా నీ ఋణమును - మరువగలనా నీ ప్రేమను కన్నతండ్రిగ - నన్ను కాచి - కన్నీరు తుడిచితివి కమ్మనైన - ప్రేమ చూపి - కనువిందు చేసితివి ||అమరుడవు|| జల్దరు వృక్షమును పోలిన - గుణశీలుడవు నీవేనయ్యా - మరణము గెలిచిన పరిశుద్ధుడవు - పునరుత్థానుడవు నీవయ్యా|| 2 || జయశీలుడవు నీవేనని - ఆరాధింతును ప్రతి నిత్యము గుండె గుడిలో - నిండినావు - నీకే ఆరాధన ఆత్మదీపము - వెలిగించినావు - నీకే ఆరాధన ||అమరుడవు||