ఎవరికి ఎవరు ఈ లోకంలో

Evariki Evaru I Lokanlo

Bro. Babanna 27 Nov 2025
ఎవరికి ఎవరు ఈ లోకంలో చివరికి యేసే పరలోకంలో || 2 || ||ఎవరికి|| ఎవరెవరో ఎదురౌతుంటారు ప్రాణానికి నా ప్రాణం అంటారు || 2 || కష్టాలలో వారు కదిలి పోతారు కరుణగల యేసు నాతో ఉంటాడు || 2 || ||ఎవరికి|| ధనము నీకుంటే అందరు వస్తారు దరిద్రుడవైతే దరికెవ్వరు రారు || 2 || ఎవరిని నమ్మిన ఫలితము లేదురా యేసుని నమ్మితే మోక్షం ఉందిరా || 2 || ||ఎవరికి|| మనుషుల సాయం వ్యర్ధమురా రాజుల నమ్మిన వ్యర్ధమురా || 2 || యెహోవాను ఆశ్రయించుట ఎంత మేలు.. ఎంతో మేలు || 2 || ||ఎవరికి||