దేవా మా కుటుంబము
Deva Ma Kutumbamu
01 Mar 2026
దేవా మా కుటుంబము నీ సేవకే అంకితము
ఈ శాప లోకానా నీ సాక్షులుగ నిలువ || 2 ||
నీ ఆత్మతో నింపుమా నీ ఆత్మతో నింపుమా
దేవా మా కుటుంబము నీ సేవకే అంకితము || 2 ||
కాపరి మా యేసు ప్రభువే కొదువేమి లేదు మాకు
మాకేమి భయము మాకేమి దిగులు నీకే వందనములయ్య
లోబడి జీవింతుము లోపంబులు సవరించుము
లోకాశలువీడి లోకంబులోన నీమందగా ఉందుము || దేవా మా ||
సమృద్ధి జీవంబును సమృద్ధిగా మాకింమ్ము
నెమ్మదిగల ఇల్లు నిమ్మళమగు మనస్సు ఇమ్మహిలో మాకిమ్మయ్య
ఇమ్ముగ దయచేయుము గిన్నెనిండిన అనుభవము
ఎన్నో కుటుంబాల ధన్యులుగా చేయంగ మమ్ములను బలపరచుము
|| దేవా మా ||
ఏ కీడు రాకుండగా కాపాడుము మాపిల్లలను
లోకాదుర వ్యసనముల తాకుడులేకుండ దాచుము నీచేతులలో
వోలీవ మొక్కల వలెను ధ్రాక్ష తీగలను పోలి
ఫలసంపదలతోను కలకాలము జీవించ కురిపించుము నీదీవెనలన్ || దేవా మా ||
పెంపార జేయుము మాలో సొంపుగ నీఘన ప్రేమన్
నింపుమ హృదయముల శాంతిభాగ్యంబులతొ సంతసంబుగ సాగెదము
వింతైన నీప్రేమను అంతట ప్రకటింతుము
కొంతకాలమే మేము ఉందుము లోకానా చెంతచేరగ కోరెదము. || దేవా మా ||