యేసయ్యా కనికరపూర్ణుడా
Yesayya Kanikarapurnuda
Hossanna Ministers
23 Nov 2025
యేసయ్యా కనికరపూర్ణుడా
మనోహర ప్రేమకు నిలయుడా || 2 ||
నీవే నా సంతోష గానము
సర్వ సంపదలకు ఆధారము || 2 || ||యేసయ్యా||
నా వలన ఏదియు ఆశించకయే ప్రేమించితివినను రక్షించుటకు ఉన్నత భాగ్యము విడచితివి || 2 ||
సిలువ మ్రానుపై రక్తము కార్చి రక్షించితివిశాశ్వత కృప పొంది జీవింతును ఇల నీ కొరకే || 2 || ||యేసయ్యా||
నా కొరకు సర్వము ధారాళముగా దయచేయువాడవుదాహము తీర్చుటకు బండను చీల్చిన ఉపకారివి || 2 ||
అలసిన వారి ఆశను తృప్తిపరచితివిఅనంత కృపపొంది ఆరాధింతును అనుక్షణము || 2 || ||యేసయ్యా||
నీ వలన బలమునొందిన వారే ధన్యులునీ సన్నిధి అయిన సీయోనులో వారు నిలిచెదరు || 2 ||
నిలువరమైన రాజ్యములో నిను చూచుటకునిత్యము కృపపొంది సేవించెదను తుదివరకు || 2 || ||యేసయ్యా||
ఆరాధనకు యోగ్యుడవు ఎల్లవేళలా పూజ్యుడవు (4)
ఎల్లవేళలా పూజ్యుడవు ఆరాధనకు యోగ్యుడవు (4)