నేను పిలిస్తే పరుగున

Nenu Piliste Paruguna

24 Nov 2025
నేను పిలిస్తే పరుగున విచ్చేస్తారు నేను స్తుతిస్తే నా ప్రార్థనాలకిస్తారు నేను ఏడిస్తే లాలించి ఓదారుస్తారు ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసుది – || 2 || ||నేను పిలిస్తే|| నేను అలసిపోతే తన చేతిని అందిస్తారు అల కరుణతో నన్ను నడిపిస్తారు || 2 || శక్తినిస్తారు నాకు సౌఖ్యమిస్తారు ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసుది – || 2 || ||నేను పిలిస్తే|| నన్ను వెంబడించమని యేసు పిలిచారు తానే వెలుగై నాకు మార్గమయ్యారు || 2 || కాంతినిచ్చి నాకు శాంతినిస్తున్నారు ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసుది – || 2 || ||నేను పిలిస్తే||