సిలువలో సాగింది యాత్ర
Siluvalo Sagindi Yatra
25 Nov 2025
సిలువలో సాగింది యాత్ర
కరుణామయుని దయగల పాత్ర || 2 ||
ఇది ఎవరి కోసమో
ఈ జగతి కోసమే
ఈ జనుల కోసమే ||సిలువలో||
పాలు కారు దేహము పైన
పాపాత్ముల కొరడాలెన్నో || 2 ||
నాట్యమాడినాయి నడి వీధిలో నిలిపాయి || 2 ||
నోరు తెరువ లేదాయే ప్రేమ
బదులు పలుక లేదాయే ప్రేమ || 2 || ||ఇది ఎవరి||
వెనుక నుండి తన్నింది ఒకరు
తన ముందు నిలిచి నవ్వింది మరి ఒకరు || 2 ||
గేలి చేసినారు పరిహాసమాడినారు || 2 ||
నోరు తెరువ లేదాయే ప్రేమ
బదులు పలుక లేదాయే ప్రేమ || 2 || ||ఇది ఎవరి||