ఎందుకో ఈ ప్రేమ

Enduko I Prema

26 Nov 2025
ఎందుకో ఈ ప్రేమ నన్నింతగ ప్రేమించెను ఎందుకో ఈ జాలి నాపై కురిపించెను || 2 || ఏ యోగ్యత లేని ఓటి కుండను నీ పాత్రగ చేసి ఎన్నుకుంటివి || 2 || ఎనలేని కృపనిచ్చితివి ||ఎందుకో|| నీ సన్నిధి పలుమార్లు నే వీడినానే అయినా నీవు క్షమియించినావే ఊహించని మేలులతో దీవించినావే నా సంకటములను కదా తీర్చినవే || 2 || ఏ యోగ్యత లేని దీనుడను ఏమివ్వగలను నీ ప్రేమకు (నా) సర్వం నీకే అర్పింతును – || 2 || ||ఎందుకో|| మా కొరకు బలి పశువై మరణించినావు మా పాప శిక్ష తొలగించినావు పలు విధముల శోధనలో తోడైనావు ఏ కీడు రాకుండ మేము కాచినావు || 2 || రుచి చూపినావు నీ ప్రేమను ఆ ప్రేమలో నేను జీవింతును నీవే నాకు ఆధారము – || 2 || ||ఎందుకో||