శృతిచేసి నే పాడనా
Srticesi Ne Padana
26 Nov 2025
శృతిచేసి నే పాడనా స్తోత్ర గీతం
భజియించి నే పొగడనా స్వామీ || 2 ||
శృతిచేసి నే పాడనా స్తోత్ర గీతం
హల్లేలూయా హల్లేలూయా
హల్లెలూయ హల్లెలూయ హల్లేలుయా || 2 || ||శృతిచేసి||
దానియేలును సింహపు బోనులో
కాపాడినది నీవెకదా || 2 ||
జలప్రళయములో నోవాహును గాచిన
బలవంతుడవు నీవెకదా || 2 ||
నీవెకదా (3) ||హల్లేలూయా||
సమరయ స్త్రీని కరుణతో బ్రోచిన
సత్య హితుడవు నీవెకదా || 2 ||
పాపులకొరకై ప్రాణమునిచ్చిన
కరుణామయుడవు నీవెకదా || 2 ||
నీవెకదా (3) ||హల్లేలూయా||