శక్తి చేత కాదు
Sakti Ceta Kadu
26 Nov 2025
శక్తి చేత కాదు
బలము చేత కాదు
దేవుని ఆత్మచే
సమస్తము సాధ్యము || 2 || ||శక్తి||
నోటి మాట ద్వారా ఈ సర్వ సృష్టిని
చేసెను దేవుడు శూన్యము నుండి || 2 ||
తన రూపులో తన పోలికలో || 2 ||
నిర్మించెను దేవుడు నరుని మంటి నుండి || 2 || ||శక్తి||
కౄరమైన సింహాల బోనైననూ
విశ్వాసముతో సాగెను దానియేలు || 2 ||
అగ్ని గుండములో మరణ శాసనములో || 2 ||
ఇమ్మానుయేలు యేసయ్య తోడుగా || 2 || ||శక్తి||
ఘోరమైన పాపాల బానిసైననూ
భారమైన బ్రతుకును గడుపుచున్ననూ || 2 ||
ప్రియమార నిన్నే పిలువంగ యేసు || 2 ||
దరి చేర రావా ఆ ప్రేమ నాథుని || 2 || ||శక్తి||