అదిగదిగో అల్లదిగో
Adigadigo Alladigo
30 Nov 2025
అదిగదిగో అల్లదిగో
కల్వరి మెట్టకు దారదిగో
ఆ ప్రభువును వేసిన సిలువదిగో ||అదిగదిగో||
గెత్సేమను ఒక తోటదిగో
ఆ తోటలో ప్రార్ధన స్థలమదిగో || 2 ||
అచటనే యుండి ప్రార్ధించుడని || 2 ||
పలికిన క్రీస్తు మాటదిగో || 2 || ||అదిగదిగో||
శిష్యులలో ఇస్కరియోతు
యూదాయను ఒక ఘాతకుడు || 2 ||
ప్రభువును యూదులకప్పగింప || 2 ||
పెట్టిన దొంగ ముద్దదిగో || 2 || ||అదిగదిగో||
లేఖనము నెరవేరుటకై
ఈ లోకపు పాపము పోవుటకై || 2 ||
పావనుడేసుని రక్తమును గల || 2 ||
ముప్పది రూకల మూటదిగో || 2 || ||అదిగదిగో||
చలి కాచుకొను గుంపదిగో
ఆ పేతురు బొంకిన స్థలమదిగో || 2 ||
మూడవసారి బొంకిన వెంటనే || 2 ||
కొక్కొరొకోయను కూతదిగో || 2 || ||అదిగదిగో||
యూదుల రాజువు నీవేనా
మోదముతో నీవన్నట్లే || 2 ||
నీలో దోషము కనుగొనలేక || 2 ||
చేతులు కడిగిన పిలాతుడాడుగో || 2 || ||అదిగదిగో||
గొల్గొతా స్థల అద్దరిని
ఆ ఇద్దరు దొంగల మధ్యమున || 2 ||
సాక్షాత్తు యెహోవా తనయుని || 2 ||
సిలువను వేసిరి చూడదిగో || 2 || ||అదిగదిగో||
గొల్లున ఏడ్చిన తల్లదిగో
ఆ తల్లికి చెప్పిన మాటదిగో || 2 ||
యూదుల రాజా దిగి రమ్మనుచు || 2 ||
హేళన చేసిన మూకదిగో || 2 || ||అదిగదిగో||
దాహము గొనుచున్నాననుచు
ప్రాణము విడిచెను పావనుడు || 2 ||
పరిశుద్ధుడు మన రక్షకుడేసు || 2 ||
మన మది యేమో గమనించు || 2 || ||అదిగదిగో||