శ్రీ యేసుండు జన్మించె రేయిలో
Sri Yesundu Janmince Reyilo
26 Nov 2025
శ్రీ యేసుండు జన్మించె రేయిలో || 2 ||
నేడు పాయక బెత్లెహేము ఊరిలో || 2 || ||శ్రీ యేసుండు||
ఆ కన్నియ మరియమ్మ గర్భమందున || 2 ||
ఇమ్మానుయేలనెడి నామమందున || 2 || ||శ్రీ యేసుండు||
సత్రమందున పశువులశాల యందున || 2 ||
దేవపుత్రుండు మనుజుండాయెనందునా || 2 || ||శ్రీ యేసుండు||
పట్టి పొత్తి గుడ్డలతో చుట్టబడి || 2 ||
పశుల తొట్టిలో పరుండ బెట్టబడి || 2 || ||శ్రీ యేసుండు||
గొల్లలెల్లరు మిగుల భీతిల్లగా || 2 ||
దెల్పె గొప్ప వార్త దూత చల్లగా || 2 || ||శ్రీ యేసుండు||
మన కొరకొక్క శిశువు పుట్టెను || 2 ||
ధరను మన దోషములబోగొట్టెను || 2 || ||శ్రీ యేసుండు||
పరలోకపు సైన్యంబు గూడెను || 2 ||
మింట వర రక్షకుని గూర్చి పాడెను || 2 || ||శ్రీ యేసుండు||
అక్షయుండగు యేసు పుట్టెను || 2 ||
మనకు రక్షణంబు సిద్ధపరచెను || 2 || ||శ్రీ యేసుండు||