శుద్ధ హృదయం కలుగజేయుము
Suddha Hrdayam Kalugajeyumu
26 Nov 2025
శుద్ధ హృదయం కలుగజేయుము || 3 ||
నీ వాత్సల్యం నీ బాహుళ్యం
నీ కృపా కనికరం చూపించుము || 2 ||
పాపము చేసాను దోషినై ఉన్నాను || 2 ||
తెలిసియున్నది నా అతిక్రమమే
తెలిసియున్నది నా పాపములే || 2 ||
నీ సన్నిధిలో నా పాపములే
ఒప్పుకొందునయ్యా || 2 ||
శుద్ధ హృదయం కలుగజేయుము || 2 ||
నాలోనా నాలోనా || 2 ||
శుద్ధ హృదయం కలుగజేయుము || 3 ||
నీ జ్ఞానమును నీ సత్యమును
నా ఆంతర్యములో పుట్టించుము || 2 ||
ఉత్సాహ సంతోషం నీ రక్షనానందం
కలుగజేయుము నా హృదయములో || 4 ||
నీ సన్నిధిలో పరిశుద్దాత్మతో
నన్ను నింపుమయ్యా || 2 || ||శుద్ధ||