అబ్రహాము దేవుడవు

Abrahamu Devudavu

27 Nov 2025
అబ్రహాము దేవుడవు - ఇస్సాకు దేవుడవు యాకోబు దేవుడవు - నాకు చాలిన దేవుడవు యేసయ్యా నా యేసయ్యా - యేసయ్యా నా యేసయ్యా || 2 || అబ్రహాము విశ్వాసముతొ - స్వ దేశము విడచెను పునాదులు గల పట్టణమునకై వేచి జీవించెను || 2 || అబ్రహాముకు చాలిన దేవుడు నీవే నయ్యా || 2 || యేసయ్యా నా యేసయ్యా - యేసయ్యా నా యేసయ్యా || 2 || || అబ్రహాము || ఇస్సాకు విధేయుడై బలియాగమాయెను వాగ్ధానాన్ని బట్టి మృతుడై లేచెను || 2 || ఇస్సాకుకు చాలిన దేవుడు నీవేనయ్యా || 2 || యేసయ్యా నా యేసయ్యా - యేసయ్యా నా యేసయ్యా || 2 || || అబ్రహాము || యాకోబు మోసగాడై తండ్రి ఇంటిని విడచెను యాకోబు ఇశ్రాయేలై తండ్రి ఇంటికి చేరెను || 2 || యాకోబుకు చాలిన దేవుడు నీవేనయ్యా || 2 || యేసయ్యా నా యేసయ్యా - యేసయ్యా నా యేసయ్యా || 2 || || అబ్రహాము ||