పరిశుధ్ధుడా నా యేసయ్యా

Parisudhdhuda Na Yesayya

27 Nov 2025
పరిశుధ్ధుడా నా యేసయ్యా నీదు ఆత్మతొ మము నింపుమా అభిషిక్తుడా నా యేసయ్యా ||2|| నీ అభిషేకముతో మము నడుపుమా నీదు ఆత్మతొ మము నింపుమా నీ అభిషేకముతొ మము నడుపుమా ||2|| తిష్భీయుడైన ఏలియాను నీవు ఆత్మతొ నింపి నడిపించావు ||2|| కర్మెలు పర్వతమెదుట జనులందరిముందు ఏలియాను నీవు ఘనపరిచావు ||2|| నీదు ఆత్మతొ మము నింపుమా నీ అభిషేకముతొ మము నడుపుమా ||2|| ||పరిశుధ్ధుడా|| దైవజనుడైన ఎలీషాను నీవు రెండంతల ఆత్మతొ నడిపించావు ||2|| యెరికో నీళ్ళను మంచిగ మార్చి మరణము రాకుండ తప్పించావు ||2|| నీదు ఆత్మతొ మము నింపుమా నీ అభిషేకముతొ మము నడుపుమా ||2|| ||పరిశుధ్ధుడా|| శిశ్యుడైన పేతురును నీవు ఆత్మతొ నింపి నడిపించావు ||2|| బోధించే వరమును ఇచ్చి సాక్షిగ నిలిపీ వేలమందిని మార్చావయ్య ||2|| ||పరిశుధ్ధుడా||