ఇది కోతకు సమయం
Idi Kotaku Samayam
Andhra Kraisthava Keerthanalu
27 Nov 2025
ఇది కోతకు సమయం
పనివారి తరుణం – ప్రార్ధన చేయుదమా || 2 ||
పైరును చూచెదమా – పంటను కోయుదమా || 2 || ||ఇది కోతకు||
కోతెంతో విస్తారమాయెనే
కోతకు పనివారు కొదువాయెనే || 2 ||
ప్రియయేసు నిధులన్ని నిలువాయెనే || 2 || ||ఇది కోతకు||
సంఘమా మౌనము దాల్చకుమా
కోసెడి పనిలోన పాల్గొందుమా || 2 ||
యజమాని నిధులన్ని మీకే కదా || 2 || ||ఇది కోతకు||
శ్రమలేని ఫలితంబు మీకీయగా
వలదంచు వెనుదీసి విడిపోదువా || 2 ||
జీవార్ధ ఫలములను భుజియింపవా || 2 || ||ఇది కోతకు||