ఇదిగో కలువరి సిలువ ప్రేమ
Idigo Kaluvari Siluva Prema
27 Nov 2025
ఇదిగో కలువరి సిలువ ప్రేమ
మరపురాని మధుర ప్రేమ యేసు ప్రేమ
నా యేసు ప్రేమ
యేసు ప్రేమ శ్రీ యేసు ప్రేమ
యేసుని సిలువకు పంపిన ప్రేమ
దోషిని కరుణతో పిలిచిన ప్రేమ
మరువజాలని ప్రేమ
నన్ను మరువని ప్రేమ ||ఇదిగో||
మహిమైశ్వర్యము బాసిన ప్రేమ
నా దోషములను మోసిన ప్రేమ
విడువజాలని ప్రేమ
నన్ను విడువని ప్రేమ ||ఇదిగో||
చెడిన నన్ను కడిగిన ప్రేమ
పడిన నన్ను లేపిన ప్రేమ
మరువలేని ప్రేమ
మారనీ యేసు ప్రేమ ||ఇదిగో||