నమ్మకమైన దేవుడవైన నీవే చాలు
Nammakamaina Devudavaina Nive Calu
A R Stevenson
16 Dec 2025
నమ్మకమైన దేవుడవైన నీవే చాలు యేసయ్యా || 2 ||
నేనేమైయున్నా ఏ స్థితిలో ఉన్నా || 2 ||
ఇంకేమి కోరుకోనయ్యా || 2 || ||నమ్మకమైన||
ఆప్తులైన వారే హాని చేయచూసినా
మిత్రులే నిలువకుండినా || 2 ||
న్యాయము తీర్చే నీవు నాకుంటే || 2 ||
చాలు యేసయ్యా || 2 || ||నమ్మకమైన||
జ్ఞానమంత చూపి శక్తి ధారపోసినా
నష్టమే మిగులుచుండినా || 2 ||
శాపము బాపే నీవు నాకుంటే || 2 ||
చాలు యేసయ్యా || 2 || ||నమ్మకమైన||
కష్ట కాలమందు గుండె జారిపోయినా
గమ్యమే తెలియకుండినా || 2 ||
సాయము చేసే నీవు నాకుంటే || 2 ||
చాలు యేసయ్యా || 2 || ||నమ్మకమైన||