ఇన్నాళ్లు తోడుగా మాతో నడిచావు

Innallu Toduga Mato Nadicavu

A R Stevenson 27 Nov 2025
ఇన్నాళ్లు తోడుగా మాతో నడిచావు ఇమ్మానుయేలుగా వెన్నంటి నిలిచావు || 2 || ఇశ్రాయేలు కాపరి నీకు స్తోత్రము నిన్నే అనుసరింతుము జీవితాంతము || 2 || ఘనులైన వారే గతియించగా ధనమున్నవారే మరణించగా || 2 || ఎన్నతగని వారమైనా మమ్ము కనికరించావు మా దినములు పొడిగించి సజీవులుగా ఉంచావు || 2 || ||ఇశ్రాయేలు|| మా కంట కన్నీరు జారకుండగా ఏ కీడు మా దరికి చేరకుండగా || 2 || కంటి రెప్పలా కాచి భద్రపరచియున్నావు దుష్టుల ఆలోచనలు భంగపరచియున్నావు || 2 || ||ఇశ్రాయేలు||