ఆ భోజన పంక్తిలో

A Bhojana Panktilo

Victor Paul 30 Nov 2025
ఆ భోజన పంక్తిలో సీమోను ఇంటిలో అభిషేకం చేసింది అత్తరుతో యేసయ్యను || 2 || కన్నీళ్లతో పాదాలు కడిగింది తన కురులతో పాదాలు తుడిచింది || 2 || సువాసన సువాసన ఇల్లంత సువాసనా ఆరాధన దైవ ఆరాధన ఆత్మీయ ఆలాపన || 2 || జుంటి తేనె ధారల కన్నా మధురమైనది వాక్యం ఆ వాక్యమే నన్ను బ్రతికించెను || 2 || హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా ఆరాధన ఆరాధన దైవ ఆరాధన ఆత్మీయ ఆలాపన || 2 || ||ఆ భోజన|| సింహాల నోళ్లను మూసినది ఈ వాక్యం దానియేలుకు ఆపై విడుదలిచ్చె ఈ వాక్యం || 2 || హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా ఆరాధన ఆరాధన దైవ ఆరాధన ఆత్మీయ ఆలాపన || 2 || ||ఆ భోజన||