నీ చేతిలో రొట్టెను నేనయ్య

Ni Cetilo Rottenu Nenayya

03 Dec 2025
నీ చేతిలో రొట్టెను నేనయ్య విరువు యేసయ్యా || 2 || విరువు యేసయ్యా ఆశీర్వదించు యేసయ్యా || 2 || ||నీ చేతిలో|| తండ్రి ఇంటినుండి పిలిచితివి అబ్రామును ఆశీర్వదించితివి అబ్రహాముగా మార్చితివి || 2 || ||నీ చేతిలో|| అల యాకోబును నీవు పిలిచితివి ఆనాడు ఆశీర్వదించితివి ఇశ్రాయేలుగా మార్చితివి || 2 || ||నీ చేతిలో|| హింసకుడు దూషకుడు హానికరుడైన సౌలును విరిచితివి పౌలుగా మార్చితివి || 2 || ||నీ చేతిలో||