సన్నుతింతుమో ప్రభో
Sannutintumo Prabho
05 Dec 2025
సన్నుతింతుమో ప్రభో
సదమలమగు భక్తితో || 2 ||
కన్న తండ్రి కావుమా || 2 ||
కలుషము నెడబాపుమా ||సన్నుతింతుమో||
నీతి సూర్య తేజమా
జ్యోతి రత్న రాజమా || 2 ||
పాతక జన రక్షకా || 2 ||
పతిత పావన నామకా ||సన్నుతింతుమో||
మానవ సంరక్షకా
దీన నిచయ పోషకా || 2 ||
దేవా మానవ నందనా || 2 ||
దివ్య సుగుణ మందనా ||సన్నుతింతుమో||
ప్రేమ తత్వ బోధకా
క్షేమ దాత వీవెగా || 2 ||
కామిత ఫలదాయక || 2 ||
స్వామి యేసు నాయక ||సన్నుతింతుమో||
పాప చింతలన్నిటిన్
పారదోలుమో ప్రభో || 2 ||
నీ పవిత్ర నామమున్ || 2 ||
నిరతము స్మరియించెదన్ ||సన్నుతింతుమో||