రక్షకుండుదయించినాడట

Raksakundudayincinadata

01 Dec 2025
రక్షకుండుదయించినాడట – మన కొరకు పరమ రక్షకుండుదయించినాడట రక్షకుండుదయించినాడు – రారే గొల్ల బోయలార తక్షనమున బోయి మన ని – రీక్షణ ఫల మొందెదము ||రక్షకుండు|| దావీదు వంశమందు ధన్యుడు జన్మించినాడు || 2 || దేవుడగు యెహోవా మన – దిక్కు దేరి చూచినాడు ||రక్షకుండు|| గగనము నుండి డిగ్గి – ఘనుడు గాబ్రియేలు దూత || 2 || తగినట్టు చెప్పే వారికి – మిగుల సంతోష వార్త ||రక్షకుండు|| వర్తమానము జెప్పి దూత – వైభవమున పోవుచున్నాడు || 2 || కర్తను జూచిన వెనుక – కాంతుము విశ్రమం బప్పుడు ||రక్షకుండు|| పశువుల తొట్టిలోన – భాసిల్లు వస్త్రముల జుట్టి || 2 || శిశువును గనుగొందురని – శీఘ్రముగను దూత తెల్పె ||రక్షకుండు|| అనుచు గొల్ల లొకరి కొకరు – ఆనవాలు జెప్పుకొనుచు || 2 || అనుమతించి కడకు క్రీస్తు – నందరికినీ దెల్పినారు ||రక్షకుండు||