మార్గము చూపుము ఇంటికి

Margamu Cupumu Intiki

01 Dec 2025
మార్గము చూపుము ఇంటికి – నా తండ్రి ఇంటికి మాధుర్య ప్రేమా ప్రపంచమో – చూపించు కంటికి || 2 || పాప మమతల చేత – పారిపోయిన నాకు ప్రాప్తించె క్షామము పశ్చాత్తాప్పమునొంది – తండ్రి క్షమ కోరుచు పంపుము క్షేమము || 2 || ప్రభు నీదు సిలువ – ముఖము చెల్లని నాకు పుట్టించె ధైర్యము || 2 || ||మార్గము|| ధనమే సర్వంబనుచు- సుఖమే స్వర్గంబనుచు తండ్రిని వీడితి ధరణి భోగములెల్ల – బ్రతుకు ధ్వంసము జేయ దేహీ నిను చేరితి || 2 || దేహీ అని నీ వైపు – చేతులెత్తిన నాకు దారిని జూపుము || 2 || ||మార్గము|| దూర దేశములోన – బాగుందుననుకొనుచు తప్పితి మార్గము తరలిపోయిరి నేను – నమ్మిన హితులెల్ల తరిమే దారిద్య్రము || 2 || దాక్షిణ్య మూర్తి నీ – దయ నాపై కురిపించి ధన్యుని చేయుము || 2 || ||మార్గము|| అమ్ముకొంటిని నేను – అధముడొకనికి నాడు ఆకలి బాధలో అన్యాయమయిపోయే – పందులు సహ వెలివేయ అలవడెను వేదన || 2 || అడుగంటె అవినీతి – మేల్కొనియె మానవత ఆశ్రయము గూర్చుము || 2 || ||మార్గము|| కొడుకునే కాదనుచు – గృహమే చెరసాలనుచు కోపించి వెళ్ళితి కూలివానిగనైన – నీ యింట పని చేసి కనికరమే కోరుదు || 2 || కాదనకు నా తండ్రి – దిక్కెవ్వరును లేరు క్షమియించి బ్రోవుము || 2 || ||మార్గము|| నా తండ్రి నను జూచి – పరుగిడిచూ ఏతెంచి నాపైబడి ఏడ్చెను నవ జీవమును గూర్చి – ఇంటికి తోడ్కొని వెళ్లి నన్నూ దీవించెను || 2 || నా జీవిత కథయంత – యేసు ప్రేమకు ధరలో సాక్ష్యమై యుండును || 2 || ||మార్గము||