సీయోను పాటలు సంతోషముగా

Siyonu Patalu Santosamuga

05 Dec 2025
సీయోను పాటలు సంతోషముగా పాడుచు సీయోను వెల్లుదము || 2 || లోకాన శాశ్వతానందమేమియు లేదని చెప్పెను ప్రియుడేసు || 2 || పొందవలె నీ లోకమునందు కొంతకాలమెన్నో శ్రమలు || 2 || ||సీయోను|| ఐగుప్తును విడచినట్టి మీరు అరణ్యవాసులే ఈ ధరలో || 2 || నిత్యనివాసము లేదిలలోన నేత్రాలు కానానుపై నిల్పుడి || 2 || ||సీయోను|| మారాను పోలిన చేదైన స్థలముల ద్వారా పోవలసియున్ననేమి || 2 || నీ రక్షకుండగు యేసే నడుపును మారని తనదు మాట నమ్ము || 2 || ||సీయోను|| ఐగుప్తు ఆశలనన్నియు విడిచి రంగుగ యేసుని వెంబడించి || 2 || పాడైన కోరహు పాపంబుమాని విధేయులై విరాజిల్లుడి || 2 || ||సీయోను|| ఆనందమయ పరలోకంబు మనది అక్కడనుండి వచ్చునేసు || 2 || సీయోను గీతము సొంపుగ కలసి పాడెదము ప్రభుయేసుకు జై || 2 || ||సీయోను||