బ్రతకాలని ఉన్నా బ్రతకలేకున్నా
Bratakalani Unna Bratakalekunna
06 Dec 2025
బ్రతకాలని ఉన్నా బ్రతకలేకున్నా
నిలవాలని ఉన్నా నిలవలేకున్నా || 2 ||
చూడాలని ఉన్నా చూడలేకున్నా
చేరాలని ఉన్నా నిను చేరలేకున్నా
బ్రతికించుమో యేసయ్యా
దరి చేర్చుమో నన్నయ్యా || 2 || ||బ్రతకాలని||
కాపరి లేని గొర్రెనైతి
కాటికి నే చేరువైతి
కావలి లేని తోటనైతి
కారడవిగా నే మారితి
గూడు చెదరిన గువ్వనైతి
గుండె పగిలిన ఎకాకినైతి
గుండె దిగులుగా ఉందయ్యా
గూడు చేర్చుమో యేసయ్యా || 2 || ||బ్రతకాలని||
నా ఆశలే అడియాశలై
అడుగంటెనే నా జీవితం
శోధనల సుడివడిలో
తొట్రిల్లెనే నా పయనం
చుక్కాని లేని నావనైతి
గమ్యం తెలియక అల్లాడుచుంటి
గురి చేర్చుమో యేసయ్యా
గుండె గుడిలో నీవుండయ్యా || 2 || ||బ్రతకాలని||