భూమ్యాకాశములు సృజించిన
Bhumyakasamulu Srjincina
06 Dec 2025
భూమ్యాకాశములు సృజించిన
యేసయ్యా నీకే స్తోత్రం || 2 ||
నీ ఆశ్ఛర్యమైన క్రియలు నేనెలా మరచిపోదును || 2 ||
హల్లెలూయ లూయ హల్లెలూయా || 4 ||
బానిసత్వమునుండి శ్రమల బారినుండి విడిపించావు నన్ను
దీన దశలో నేనుండగా నను విడువవైతివి || 2 || || భూమ్యాకాశములు ||
జీవాహారమై నీదు వాక్యము పోషించెను నన్ను
ఆకలితో అల్లాడగా నను తృప్తిపరచితివి || 2 || || భూమ్యాకాశములు ||
భుజంగములను అణచివేసి కాచినావు నన్ను
ఆపదలో చిక్కుకొనగా నన్ను లేవనెత్తితివి || 2 || || భూమ్యాకాశములు ||
నూతన యెరూషలేం నిత్యనివాసమని తెలియజేసితివి
నిట్టూర్పులలో ఉండగా నను ఉజ్జీవ పరచితివి || 2 || || భూమ్యాకాశములు ||