ప్రభు యేసుని వదనములో
Prabhu Yesuni Vadanamulo
A. B. Masilamani Garu
06 Dec 2025
ప్రభు యేసుని వదనములో – నా దేవుడు కనిపించె || 2 ||
పాపాత్ముల బ్రోచుటకై – కృపలొలికిన కలువరిలో || 2 ||
పరలోకముకై – చిర జీవముకై || 2 ||
ప్రార్ధించెను నా హృదయం ||ప్రభు యేసుని||
దిశలన్నియు తిరిగితిని – నా పాపపు దాహముతో || 2 ||
దౌష్ట్యములో మసలుచును – దౌర్జన్యము చేయుచును || 2 ||
ధన పీడనతో – మృగ వాంఛలతో || 2 ||
దిగాజారితి చావునకు ||ప్రభు యేసుని||
యేసు నీ రాజ్యములో – భువి కేతెంచెడి రోజు || 2 ||
ఈ పాపిని క్షమియించి – జ్ఞాపకముతో బ్రోవుమని || 2 ||
ఇల వేడితిని – విలపించుచును || 2 ||
ఈడేరెను నా వినతి ||ప్రభు యేసుని||
పరదైసున ఈ దినమే – నా ఆనందములోను || 2 ||
పాల్గొందువు నీవనుచు – వాగ్ధానము చేయగనే || 2 ||
పరలోకమే నా – తుది ఊపిరిగా || 2 ||
పయనించితి ప్రభు కడకు ||ప్రభు యేసుని||